అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్స్ వ్యవహారం ఇప్పుడు భారత్-అమెరికా మధ్య పెద్ద హాట్ టాపిక్ అయింది. ఆగస్టు 27 నుంచి భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే కొన్ని వస్తువులపై మరో 25% టారిఫ్స్ అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించాడు. అంటే, ఇప్పుడున్న టారిఫ్స్‌తో కలిపితే మొత్తం 50% అవుతుంది.
అయితే, ఈ టారిఫ్స్‌పై ఇండియాతో డిస్కషన్స్ జరిపే ప్రసక్తే లేదని అమెరికా తేల్చి చెప్పింది. మొదట్లో ఈ విషయంలో సైలెంట్గా ఉన్న ఇండియా, ఇప్పుడు నేరుగా కౌంటర్ ఇస్తోంది. “మా వస్తువులు కొనాలంటే కొనండి, లేదంటే లేదు, మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయట్లేదు కదా” అని మన ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గట్టిగా సమాధానం ఇచ్చారు. ఈ ట్రెండ్ చూస్తుంటే, ట్రంప్ టారిఫ్స్ వల్ల భారత ఎక్స్‌పోర్ట్స్ బాగా దెబ్బతింటాయనే ఆందోళన కనిపిస్తున్నా, ప్రభుత్వం మాత్రం పట్టుదలగా ఉంది.
ట్రంప్ ఈ టారిఫ్స్ వార్ను మొదలుపెట్టడానికి అసలు కారణం ఏంటంటే, రష్యా నుంచి భారత్ ఆయుధాలు, ఆయిల్ పర్చేస్ చేయడమే. రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేయడం ఆ దేశానికి ఆర్థికంగా సపోర్ట్ చేయడమే అవుతుంది, అది అమెరికాకు ఇష్టం లేదు. అందుకే ట్రంప్, భారత్ మీద ప్రెజర్ తేవడానికి టారిఫ్స్ విధించినట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరలిన్ లీవెట్ కూడా చెప్పారు. అమెరికాకు నచ్చని పనులను భారత్ చేస్తోందని, ఫ్రెండ్లీ కంట్రీస్ ఇలా ప్రవర్తించవని ఆరోపిస్తున్నారు.0
ట్రంప్ ఆరోపణలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నది ఒక్క భారత్ మాత్రమే కాదు, చైనా, యూరప్ దేశాలు కూడా భారీగా పర్చేస్ చేస్తున్నాయని మన ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ వివరించారు. అంతేకాదు, తాము అమెరికా నుంచి కూడా పెద్ద మొత్తంలో ఆయిల్ పర్చేస్ చేస్తున్నామని చెప్పారు. ట్రంప్ టారిఫ్స్ వెనుక సరైన కారణం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు ట్రేడ్ చేయాలని చెబుతూనే, మరోవైపు మమ్మల్ని సాంక్షన్స్తో బెదిరించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
అమెరికా టారిఫ్స్‌పై చైనా, రష్యా దేశాలు భారత్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నాయి. అమెరికా పర్చేస్ చేయని భారతీయ ఎక్స్‌పోర్ట్స్‌ను తాము పర్చేస్ చేస్తామని రష్యా ప్రకటించింది. అంతేకాదు, చైనా కూడా WTO లో భారత్‌తో కలిసి ట్రంప్ టారిఫ్స్‌పై పోరాడతామని చెబుతోంది. దీనివల్ల చైనా-భారత్ మధ్య ఫ్రెండ్‌షిప్ కూడా పెరుగుతోంది.
అమెరికా విధించిన ఈ 50% టారిఫ్స్ వల్ల భారతీయ వస్తువులు అమెరికా మార్కెట్లో కాస్ట్‌లీగా మారతాయి. ఉదాహరణకు, 10 డాలర్ల వస్తువు 15 డాలర్లు అవుతుంది. దీంతో అమెరికా కస్టమర్స్ భారత్ వస్తువులు కొనడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ, భారత ఎక్స్‌పోర్ట్స్‌లో కేవలం 20% మాత్రమే అమెరికాకు వెళ్తాయి. అందుకే ఈ ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చని కొంతమంది ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. జీడీపీలో కేవలం 22% మాత్రమే ఎక్స్‌పోర్ట్స్‌పై ఆధారపడి ఉన్నందున, భారత్ ఆర్థిక వ్యవస్థ దీని వల్ల దెబ్బతినదని విశ్లేషిస్తున్నారు.ట్రంప్ టారిఫ్స్ వార్ వల్ల భారత్ మరింత పట్టుదలతో ఉంది. ఈ సవాలును ఒక అపర్చునిటీగా భావిస్తోంది. మన దేశ రైతులు, వ్యాపారుల ప్రయోజనాలను కాపాడటానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోడీ ఇప్పటికే సిగ్నల్స్ ఇచ్చారు. రష్యా, చైనా దేశాల సపోర్ట్‌తో భారత్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. అయితే, ట్రంప్ తన నిర్ణయాలను మార్చుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు. చైనా విషయంలో కూడా మొదట భారీ టారిఫ్స్ విధించి, తర్వాత తగ్గించాడు. మరి భారత్ విషయంలో ట్రంప్ ఏం చేస్తాడో చూడాలి.