చైనా తన స్వార్థ బుద్ధిని ఎప్పుడూ చూపించకుండా ఉండలేదు. ఇప్పుడు కూడా అదే చేసింది. ఒకవైపు ఇండియా తో ఫ్రెండ్‌షిప్ కావాలని చెబుతూనే, మరోవైపు మన దేశంలో ఐఫోన్ల తయారీని ఆపే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న తమ ఇంజనీర్లను వెనక్కి పిలిపించింది. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న టైమ్‌లో చైనా ఇలా ఎందుకు చేసిందంటే, దీని వెనుక పెద్ద ప్లానే ఉంది.

మన దేశంలో ఐఫోన్ ప్రొడక్షన్ జరుగుతుంటే, చైనా దానికి స్పీడ్ బ్రేకర్‌లా అడ్డుపడింది. ఇది ఇండియాకు ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. ఐఫోన్ 17 ప్రొడక్షన్ కోసం రెడీ అవుతున్నప్పుడు, అందులో పనిచేస్తున్న ఇంజనీర్లను, టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్‌ను చైనా వెనక్కి పిలిపించింది. చైనా ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. కొన్ని వారాల క్రితం కూడా మన దేశంలోని ఐఫోన్ ప్లాంట్స్‌లో ఉన్న తమ ఇంజనీర్లను వెనక్కి రమ్మని చెప్పింది. దీని వల్ల ఇండియాలో ఐఫోన్ల ప్రొడక్షన్ ఆగిపోవాలని చైనా ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

ఇప్పుడు ఈ కుట్రలను మరింత పెంచింది. ఇండియాలో ఉన్న ఫాక్స్‌కాన్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన యూసన్ టెక్నాలజీ నుంచి దాదాపు 300 మంది చైనా ఇంజనీర్లను వెనక్కి పిలిపించింది. అంతేకాదు, ఇండియాకు రావాల్సిన మరో 60 మంది ఇంజనీర్ల ట్రిప్‌ను కూడా క్యాన్సిల్ చేసింది. ఇదే టైమ్‌లో ఆ కంపెనీ ఇండియాలో ఉన్న పెట్టుబడులపై ఒక రిపోర్ట్ రెడీ చేయాలని కోరడం చాలా ఆశ్చర్యంగా ఉంది.

నిజానికి యూసన్ టెక్నాలజీ సంస్థ తమిళనాడులో డిస్‌ప్లే మాడ్యూల్ అసెంబ్లీ యూనిట్‌ను పెడుతోంది. దీని కోసం 13,180 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని గత మే నెలలోనే అనౌన్స్ చేసింది. చైనా నుంచి అమెరికాకు జరిగే ఎగుమతులను తగ్గించి, ఆ ప్రొడక్షన్‌ను ఇండియాలోని ప్లాంట్స్‌కు మార్చాలని అనుకుంది. కానీ ఇంతలోనే చైనా తన చెడు ఆలోచనలను బయటపెట్టింది.

చైనా ఈ ప్లాన్‌ను ఎప్పుడో రెడీ చేసుకుంది. గతంలో ఇండియా, వియత్నాం వంటి చాలా దేశాలు చైనా మీద ఆధారపడేవి. కానీ ఇప్పుడు ఆ దేశాలన్నీ సొంతంగా డెవలప్ అవ్వడం మొదలుపెట్టాయి. అంతేకాదు, చైనాకు పోటీగా చాలా టెక్ కంపెనీలను తమ దేశాలకు ఆకర్షిస్తున్నాయి. దీంతో చైనా సప్లై మీద తీవ్ర ఎఫెక్ట్ పడింది. తన మీద ఆధారపడిన దేశాలు ఒక్కొక్కటిగా ఎదగడం చూసి చైనా తట్టుకోలేకపోతోంది.

అందుకే ఎలాంటి అనుమానాలు రాకుండా ఒకవైపు ఇండియాతో ట్రేడ్ రిలేషన్స్ బాగుండాలని చెబుతూనే, మరోవైపు మన ఎగుమతులను దెబ్బతీయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. దానిలో ఒక భాగమే ఇంజనీర్లను వెనక్కి పిలిపించుకోవడం. ఒక న్యూస్ రిపోర్ట్ ప్రకారం, ఇండియాతో పాటు సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలకు ఇంజనీర్లను పంపకుండా ఆయా కంపెనీలపై, లోకల్ గవర్నమెంట్లపై చైనా ఒత్తిడి పెడుతోంది. అమెరికాతో ట్రేడ్ టెన్షన్స్ ఉన్నందువల్ల, చైనా కంపెనీల ప్రొడక్షన్ కెపాసిటీ ఇతర దేశాలకు వెళ్లకుండా అడ్డుకునే ప్లాన్‌లో భాగంగానే ఇలా చేస్తోందని ఆ రిపోర్ట్ ఆరోపించింది.

బెంగళూరులోని దేవనహళ్లిలో దాదాపు 13 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఫాక్స్‌కాన్ ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ ఉంది. ఇది చైనా బయట ఫాక్స్‌కాన్ ఏర్పాటు చేసిన అతిపెద్ద ఫ్యాక్టరీలలో ఒకటి. ఈ కంపెనీ వల్ల లోకల్‌గా చాలా బిజినెస్‌లు, జాబ్ అవకాశాలు పెరిగాయి.

ప్రస్తుతం ప్రపంచ ఐఫోన్ ప్రొడక్షన్‌లో ఐదో వంతు మన దేశంలోనే జరుగుతోంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది చివరి నాటికి యూఎస్ కు వెళ్లే ఐఫోన్లు ఇక్కడే తయారు చేయాలని యాపిల్ కంపెనీ టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఫాక్స్‌కాన్ తీసుకున్న డెసిషన్ వల్ల, అలాగే స్కిల్స్ ఉన్న వాళ్లు లేకపోవడం వల్ల ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కష్టంగా కనిపిస్తోంది.

మొత్తంగా, చైనా ఈ పని ఎందుకు చేసిందనే దానిపై చాలా డౌట్స్ ఉన్నాయి. నిజంగానే ఇండియాతో బార్డర్ ప్రాబ్లమ్స్‌ను తగ్గించుకుని, బిజినెస్ రిలేషన్స్‌ను మెరుగుపరుచుకోవాలని చైనా అనుకుని ఉంటే, ఇంజనీర్లను ఎందుకు వెనక్కి పిలిపించింది? ఎందుకు ఇండియాలో ఐఫోన్ల తయారీకి అడ్డుగా నిలుస్తోంది? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వేధిస్తున్నాయి.

అయితే, చైనా ఈ నిర్ణయం ఇండియాపై పెద్దగా ఎఫెక్ట్ చూపకపోవచ్చని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఎందుకంటే, ఫాక్స్‌కాన్ వంటి కంపెనీలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా రావచ్చు అని ముందే ఊహించాయి. అందుకే దానికి తగ్గ ఆల్టర్నేటివ్స్ కూడా రెడీ చేసుకున్నాయి. ఇప్పుడు చైనా ఇంజనీర్లకు బదులుగా తైవాన్, జపాన్ వంటి ఇతర దేశాల నుంచి ఎక్స్‌పర్ట్స్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

గత కొన్ని నెలలుగా ఇండియా, చైనా మధ్య డిప్లమాటిక్ రిలేషన్స్ కాస్త మెరుగుపడుతున్నాయి. బార్డర్ సమస్యలు, ట్రేడ్ కోఆపరేషన్‌పై రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అలాగే బిజినెస్ రిలేషన్స్‌తో పాటు ఫ్లైట్ సర్వీసులు కూడా మళ్లీ స్టార్ట్ అయ్యాయి. తాజాగా చైనా చర్యల వల్ల ఇండియాపై పెద్దగా ఎఫెక్ట్ లేకపోయినా, డ్రాగన్ కంట్రీ ఈ కుట్రలు ఇక్కడితో ఆగిపోతాయా లేదా, రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు కొద్దికాలం మాత్రమే ఉంటాయా లేక లాంగ్‌టైమ్ కొనసాగుతాయా అనేది ఒక డౌట్‌గా మిగిలిపోయింది.

By 203389

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *